HomeTelugu Trendingప్రభాస్ ఆదిపురుష్‌పై మరో వివాదం

ప్రభాస్ ఆదిపురుష్‌పై మరో వివాదం

 

Prabhas Adipurush update

ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌ ఇప్పటికే వివాదాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై మరొకరు ఫిర్యాదు చేశారు. అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. సీత పాత్రలో కృతిసనన్‌ నటిస్తోంది. రావణాసురుడి పాత్రను బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే చాలా వివాదాలు చుట్టుముట్టాయి. ప్రోమో విడుదలైనప్పటి నుంచి నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

తాజాగా సెన్సార్ బోర్డు అనుమతి లేకుండానే ప్రోమో విడుదల చేశారని ఆరోపిస్తూ తివారి అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిల్ వేశారు. పిల్‌లో నిర్మాత, దర్శకుడిని ప్రతివాదులుగా చేర్చారు. నిర్మాత ప్రోమో రిలీజ్ చేయడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీచేసింది. ఈ సినిమాలో సీతాదేవిగా నటిస్తున్న కృతిసనన్ వస్త్రధారణపైనా పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. సీతారాములను ప్రజలు దేవతలుగా నమ్ముతారని, అయితే ఈ చిత్రంలో ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసేలా చూపిస్తున్నారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!