HomeTelugu Trendingపెదనాన్నతో ప్రభాస్ ఫోజ్‌‌.. ఫొటో వైరల్‌

పెదనాన్నతో ప్రభాస్ ఫోజ్‌‌.. ఫొటో వైరల్‌

Prabhas krishnam raju still
టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్థాయికి ఎదిగిన ప్రభాస్‌ తాజాగా ‘రాధే శ్యామ్’ పాటు మరో మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో రాధే శ్యామ్ ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. వాలెంటైన్ డే సందర్భంగా విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ తో కలిసి యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు అంతా లండన్ లోనే జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా అక్కడికి వెళ్లారు. అక్కడే కొన్నాళ్లు ఉన్నారు. అబ్బాయితో పాటు ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు కృష్ణంరాజు. ఇద్దరూ కలిసి ఇచ్చిన ఫోజు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫొటో పోస్ట్ చేశాడు రెబల్ స్టార్. అందులో స్టైలిష్ గా ఇద్దరూ నిలబడి తలపై చేతులు పెట్టుకుని కనిపించారు. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by U.V.Krishnam Raju (@uvkrishnamraju)

Recent Articles English

Gallery

Recent Articles Telugu