
Prabhas Real Estate Endorsement:
ప్రభాస్, మహేష్ బాబు… ఇవాళ్టి టాలీవుడ్ టాప్ హీరోలు. వీళ్లకు ఒకేలా భారీ మొత్తంలో బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ వస్తుంటాయి. కానీ తాజాగా వచ్చిన సమాచారం మేరకు, రియల్ ఎస్టేట్ బ్రాండ్స్ విషయంలో మాత్రం వీళ్లిద్దరూ “నో” చెప్తున్నారని తెలుస్తోంది.
ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రభాస్‌కి రూ.25 కోట్లు ఇచ్చే ప్రకటన ఒప్పందం పెట్టిందట. కానీ ప్రభాస్ ఆ ఆఫర్‌ను వెంటనే తిరస్కరించాడట. ఎందుకంటే, ఆయన సాధారణంగా వాణిజ్య ప్రకటనలకి దూరంగా ఉంటాడని, ఒకవేళ ప్రాజెక్ట్ ఫెయిలైతే తన ఇమేజ్ దెబ్బతింటుందన్న ఆలోచనతో తప్పుకున్నాడట.
దీంతో అదే కంపెనీ మహేష్ బాబుని సంప్రదించిందట. కానీ మహేష్ కూడా ఆ ఆఫర్‌కి “నో” అన్నాడట. రియల్ ఎస్టేట్ రంగం చాలా సెన్సిటివ్. ఒకవేళ ప్రాజెక్ట్ పూర్తికాకపోతే లేదా లీగల్ ఇష్యూలు వచ్చేస్తే, పేరు మంట కొట్టుకుంటుంది. ఇలాంటి అనవసర రిస్క్ ఎందుకు అనుకొని మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట.
ఇంతకీ వీళ్లు ఇలా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారంటే… గతంలో చాలామంది సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసి, ఆ కంపెనీలు మూతపడిపోయినప్పుడు ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ అనుభవాల వల్ల ఇప్పుడు స్టార్ హీరోలు చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారు.
ఇప్పుడు వాళ్లకు డబ్బు కంటే బ్రాండ్ విలువ ముఖ్యం. తమ ఇమేజ్‌కు నష్టం రాకూడదనే కోణంలో చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగం చాలా వోలటైల్ అయిపోయింది కాబట్టి, సెలబ్రిటీలకు ఇది డేంజరస్ అని చెప్పవచ్చు.
ALSO READ: 20 కోట్లు ఇస్తామన్నా SSMB29 కి నో చెప్పిన నటుడు ఎవరంటే..