ప్రభాస్‌ ‘సలార్‌’ మూవీ లాంఛ్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించినున్న ‘సలార్’ చిత్రాన్ని హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో క‌న్నడ రాకింగ్ స్టార్ య‌శ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో భారీగా అంచనాలున్నాయి. ప్రస్తుతం సలార్ లాంచింగ్ ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే ప్రభాస్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్‌ని ప్రకటించనున్నారు.

యూట్యూబ్‌లో ట్రెండ్‌ సృష్టిస్తున్న ‘వకీల్‌సాబ్‌’

CLICK HERE!! For the aha Latest Updates