HomeTelugu Trendingకంగనాకు ప్రకాష్‌ రాజ్ కౌంటర్

కంగనాకు ప్రకాష్‌ రాజ్ కౌంటర్

Prakash Raj counter to Kangబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి తరువాత హీరోయిన్ కంగనా రనౌత్ పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కొద్దిరోజులుగా కంగనా రనౌత్ హడావుడి అంతా ఇంతా కాదు. మహారాష్ట్ర సీఎంతో వివాదం.. ముంబైకు వస్తా దమ్ముంటే ఆపాలంటూ సవాలు విసరడం..ఆ తర్వాత ముంబైలో అడుగుపెట్టడం పోలీసులు భద్రత కల్పించి ఆమెను ఇంటికి పంపడం తెలిసింది. కంగనాకు సంబంధించిన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు అక్రమకట్టడం అంటూ కూల్చివేయడం ఇలాంటి విషయాలతో కంగనా మీడియాలో మారుమోగిపోయింది. కొంతమంది కంగనా ధైర్యాన్ని మెచ్చుకుంటూ రాణి లక్ష్మీభాయ్ గా అభివర్ణించారు. ఆమె దైర్యం , తెగువ అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేశారు.

రాణి లక్ష్మీభాయి శౌర్యాన్ని, ధైర్యాన్ని తాను సినిమా ద్వారా చూపించానని, నిజ జీవితంలోనూ ఎవ్వరికీ తల వంచనంటూ ఇటీవల కంగనా ట్వీట్ చేసింది. దీంతో నటుడు ప్రకాశ్ రాజ్ కంగనాకు కౌంటర్ ఇచ్చారు. ఒక్క సినిమాతోనే కంగనా రాణి లక్ష్మీబాయితో పోల్చుకుంటే మరి పద్మావతిగా నటించిన దీపికా పదుకొనె, అక్బర్‌గా నటించిన హృతిక్ రోషన్, అశోకగా నటించిన షారుక్ ఖాన్, భగత్‌సింగ్‌లా నటించిన అజయ్ దేవగన్, మంగళ్ పాండేగా నటించిన అమీర్ ఖాన్‌ను కూడా ఆ గొప్పవారితో పోల్చొచ్చు అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అనే యాష్ ట్యాగ్ ను జత చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!