HomeTelugu Big Storiesప్రకాశ్‌రాజ్‌ ఎక్కడి నుంచి పోటీచేయనున్నారంటే..!

ప్రకాశ్‌రాజ్‌ ఎక్కడి నుంచి పోటీచేయనున్నారంటే..!

4 4కొత్త సంవత్సరం ప్రారంభం రోజున క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ తాను ఎక్కడి నుంచి పోటీచేయనున్నారో స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ప్రకటించారు. తన కొత్త ప్రయాణానికి మద్దతుగా నిలుస్తున్న వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. త్వరలోనే అన్ని వివరాలను మీడియాకు వెల్లడించనున్నట్టు ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు.

‘సిటిజన్‌ వాయిస్‌’ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక దృక్పథాన్ని చాటుతున్న ప్రకాశ్‌రాజ్‌ తన ఆప్తులతో పోటీ విషయంపై చర్చలు జరిపారు. కర్ణాటకతో పాటు తెలంగాణ, తమిళనాడులోని పలు గ్రామాలను దత్తత తీసుకున్న ఈ బహుభాషా నటుడు ఏ రాష్ట్రంలో పోటీ చేస్తారనే దానిపై అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు ఈ ప్రకటనతో తెరపడింది. చలన చిత్రాల్లో సందడి చేస్తోన్న ప్రకాశ్‌రాజ్‌ గత ఏడాది ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య తర్వాత తన గళానికి పదను పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో బీజేపీని లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ ద్వారా ప్రశ్నిస్తూ తన పోరాటాన్ని కొనసాగించారు. కర్ణాటక విధానసభ ఎన్నికల సందర్భంలో గుజరాత్‌ దళిత నాయకుడు జిగ్నేశ్‌తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!