HomeTelugu Newsపుణ్య క్షేత్రాల సందర్శనకు సప్తగిరి ఎక్స్ ప్రెస్!

పుణ్య క్షేత్రాల సందర్శనకు సప్తగిరి ఎక్స్ ప్రెస్!

శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్ హోమిమోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహస్తోంది. ఈ బృందం ముందుగా డిసెంబర్ 17న శ్రీశైలం, డిసెంబర్ 20న తిరుపతి, డిసెంబర్ 21న షిరిడి వెళ్లేలా సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత రవికిరణ్ తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు, టీజర్ కు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అదే రీతిన వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాకు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ థీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాతో కన్నడ భామ రోషిణి ప్రకాష్, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. హైదరాబాద్, పోలాండ్, జర్మనీల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ షూటింగ్ జరిగింది. సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చి దిద్దారని చిత్ర బృందం తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu