HomeTelugu Trending'చెక్‌' షూటింగ్‌లో కిందపడిపోయిన ప్రియా ప్రకాశ్‌.. వీడియో వైరల్‌

‘చెక్‌’ షూటింగ్‌లో కిందపడిపోయిన ప్రియా ప్రకాశ్‌.. వీడియో వైరల్‌

Priya prakash varrier fallsవింకింగ్‌ గర్ల్‌ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలుగు నటించిన తొలి చిత్రం ‘చెక్’. నితిన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని ప్రియా పాత్ర ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగించ‌డం ఖాయం అని అంటున్నారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రియా ప్ర‌కాశ్ తాజాగా చెక్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ఫ‌న్నీ ఇన్సిడెంట్‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.తాను పరిగెత్తుకుంటూ వచ్చి నితిన్ వీపు మీదకు ఎక్కే ప్రయత్నం చేయగా.. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. బ్యాలెన్స్ త‌ప్పి కింద ప‌డిపోయింది. దీంతో వెంటనే అప్ర‌మ‌త్త‌మైన యూనిట్ ప్రియాని పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రియా ప్ర‌కాశ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. చంద్రశేఖర్ ఏలేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu