HomeTelugu Trendingనేను ఆ దర్శకుడికి పెద్ద అభిమానిని: ఎన్టీఆర్‌

నేను ఆ దర్శకుడికి పెద్ద అభిమానిని: ఎన్టీఆర్‌

Tollywood star Hero NTR wis
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌- చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఈసినిమాలో హీరోయిన్లుగా నటించారు. చదరంగం నేపథ్యంలో తెరకెక్కిన్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్రయూనిట్‌ వారం రోజులుగా ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌, ఇంటర్వ్యూలతో.. ప్రచారం హోరెత్తిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్వీట్ చేశారు.

”చంద్రశేఖర్‌ యేలేటిగారు తీసుకునే కథలకు, ఆయన కథ చెప్పే విధానానికి నేను పెద్ద అభిమానిని. ‘చెక్‌’ పోస్టర్స్‌ చూస్తుంటే.. సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. రేపు (శుక్రవారం) సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చందూకి, నితిన్‌కి.. మిగతా యూనిట్‌ మొత్తానికి నా శుభాకాంక్షలు..” అని యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్ చేశారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నుంచి అనుకోని ఈ సర్‌ప్రైజ్‌కు చిత్రయూనిట్‌ సంతోషం వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలియజేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!