HomeTelugu Newsప్రేమికుల రోజున ప్రియావారియర్..!

ప్రేమికుల రోజున ప్రియావారియర్..!

9 1
వింక్ గర్ల్‌ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ నటించిన ‘లవర్స్ డే’ చిత్రం ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై అందిస్తున్నారు. లవర్స్ డే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది.

జనవరి 23వ హైదరాబాద్‌లో లవర్స్‌డే ఆడియో ఫంక్షన్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆయన రాకతో మా సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడిందంటూ నిర్మాతలు ఆనందపడిపోతున్నారు. చిన్న చిత్రానికి బన్నీ అందించిన సహకారాన్ని మాటల్లో చెప్పలేం. ఆడియో రిలీజ్ తర్వాత ప్రియా ప్రకాశ్ వారియర్ కు టాలీవుడ్‌లో క్రేజ్ మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా చేసేందుకు, ప్రేక్షకులకు సంపూర్ణమైన వినోదాన్ని అందించేందుకు ప్రీ ప్రోడక్షన్ పనులను క్వాలిటీతో రూపొందించామని తెలిపారు.

ప్రియ వారియర్‌కు లవర్స్ డే చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి. గీత రచయితలు చంద్రబోస్, చైతన్య ప్రసాద్, శివ గణేష్, శ్రీజో, శ్రీ సాయికిరణ్ సాహిత్యాన్ని అందించారు. ఇందులో ఓ పాట థియేటర్లలో ప్రేక్షకులకు సర్ ప్రైజ్‌గా ఉంటుంది. ప్రియా వారియర్ క్రేజ్, పాటలకు విపరీతమైన స్పందన రావడంతో పెరిగిన అంచనాలకు తగినట్టుగా అన్ని ఏరియాల్లో బ్రహ్మండమైన బిజినెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలకు అన్ని హంగులు పూర్తి చేసుకొన్నాం. ప్రేమికుల దినోత్సవం కానుకగా లవర్స్ డే చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!