గోల్డ్ కలర్ డ్రెస్‌ లో మెరిసిన ప్రియాంక

వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ కు ఫోజులు ఇవ్వాలని అందరికి ఉంటుంది. వోగ్ మ్యాగజైన్ లో ఫోటోలు వచ్చాయి అంటే.. వారికి హాలీవుడ్ రేంజ్ లో అవకాశాలు వస్తాయని అర్ధం. హాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎందరో ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ పైకి ఎక్కినవారే.

ఇటీవలే హాలీవుడ్ పాప్ సింగర్ నికి జోనస్ ను వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా.. ఇటీవలే వోగ్ మ్యాగజైన్ కోసం ఫోజులు ఇచ్చింది. ఈసారి ఈ మ్యాగజైన్ కొత్తగా ప్లాన్ చేసింది. ఫోటో షూట్ కోసం బ్యాగ్ గ్రౌండ్ అంతా గోల్డ్ కలర్ వాడింది. ప్రియాంక డ్రెస్ ను కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ చేయడంతో ఆ ఫొటోకు మరింత శోభ వచ్చింది. ప్రియాంక గోల్డ్ డ్రెస్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.