ప్రధాని అవుతానంటున్న ప్రియాంక.. భర్త అధ్యక్షుడట!

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా రాజకీయాలకు దూరంగా ఉంటుంటారు. ఆమె సమాజంలో మార్పు కోసం తన వంతు సాయం చేయడానికి ముందుంటారు కానీ రాజకీయాల గురించి మాత్రం ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ తొలిసారి అవకాశముంటే తాను భారత ప్రధానిని అవుతానని అంటున్నారు. ఓ అమెరికన్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ విషయాన్ని ప్రస్తావించారు.

‘అవకాశం వస్తే నేను భారత ప్రధానిని అవుతా. నా భర్త నిక్‌ అమెరికా అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తారు. నాకు రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశాలంటే నచ్చవు. కానీ దేశంలో మార్పు రావాలని నేను, నిక్‌ కోరుకుంటున్నాం’ అన్నారు. అయితే ఆమె సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారా? లేక నిజంగానే రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉందా? అన్న విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే చిత్రంలో నటించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.