పునర్నవి సైకిల్ టీజర్ విడుదల


తెలుగు బిగ్‌బాస్‌-3 కంటెస్టెంట్‌గా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పునర్నవి భూపాళం. ఉయ్యాల జంపాల సినిమాలో లంగా ఓణీలో క్యూట్‌గా ఉన్న ఈ భామ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులరైన పునర్నవికి ఇప్పుడు సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా పున్ను హీరోయిన్‌గా ‘సైకిల్’ సినిమాలో నటించింది. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంతో పరిచయమైన మహత్ రాఘవేంద్ర ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. దురదృష్ణవంతుడి లాటరీని, అదృష్టవంతుడి జాతకాన్ని అస్సలు నమ్మకూడదు అంటూ ఫన్నీగా టీజర్ సాగుతుంది. కమెడియన్‌ సుదర్శన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.