పెళ్లి చేసుకోబోతున్న లక్ష్మి రాయ్‌


టాలీవుడ్‌లో ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రాయ్‌ లక్ష్మి. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ఐటమ్ సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అవకాశాలు తగ్గడంతో తాజాగా పెళ్లిపీటలు ఎక్కాలని నిర్ణయం తీసుకుంది రాయ్ లక్ష్మి.గత కొంతకాలంగా రాయ్ లక్ష్మి రిలేషన్‌షిప్‌లో ఉందని సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘మీ పెళ్లి ఫిక్సయింది అంట కదా?’ అంటూ నెటిజన్లు ఆమెను పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. తాజాగా వీటిపై ఆమె స్పందించింది.

‘చాలాకాలంగా పదేపదే నన్ను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఈ విషయం ప్రకటించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, అది పూర్తిగా నా వ్యక్తిగతం. నా జీవితభాగస్వామికి సంబంధించిన వివరాలు ఇప్పుడే బయటపెట్టను. మా ఎంగేజ్‌మెంట్ ఈ నెల 27న జరుగనుంది. ఇప్పటికే మా మిత్రులు, బంధువులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. ఇది ముందు నుంచి ప్లాన్ చేసింది కాదు.. అనుకోకుండా జరిగింది. ఈ విషయంలో మా కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. నా ‘లవ్‌’తో జీవితాన్ని పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పోస్ట్ చేసింది.

CLICK HERE!! For the aha Latest Updates