Homeపొలిటికల్ఐశ్వర్యరాయ్‌పై రాహుల్‌ గాంధీ కామెంట్స్‌.. ప్రముఖులు ఫైర్‌

ఐశ్వర్యరాయ్‌పై రాహుల్‌ గాంధీ కామెంట్స్‌.. ప్రముఖులు ఫైర్‌

Rahul gandhi controversial

బాలీవుడ్‌ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి. పలువురు రాజకీయనేతలు, సినీ తారలు రాహుల్‌ గాంధీ ఫైర్‌ అవుతున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో ఆయన రామమందిర ప్రారంభోత్సవం గురించి ప్రస్తావించారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలో దళితులు, వెనకబడిన వర్గాలు కనిపించలేదు అని ఆయన పేర్కొన్నారు. కనీసం రాష్ట్రపతి కూడా లేకపోవడం ఆయా వర్గాలను అవమానించడమేనని అన్నారు.

పారిశ్రామికవేత్తలు, అమితాబచ్చన్‌ను ఆహ్వానించడం ద్వారా జనాభాలో మిగతా 73 శాతం మందికి ప్రాముఖ్యత లేదని చెప్పినట్టయిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆ తరువాత మరో ర్యాలీలో మాట్లాడుతూ ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుంటే, అమితాబ్ బల్లే బల్లే అంటారని కామెంట్ చేశారు.

రాహుల్ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ మహిళలను అవమానించారంటూ సింగర్‌ సోనా మొహాపాత్ర మండిపడింది. రాహుల్ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ కన్నడిగులను అవమానించారని మండిపడింది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!