HomeTelugu Newsఅందాలను ఒలికిస్తూ రాయ్‌ లక్ష్మి .. వైరల్‌ ఫోటో..!

అందాలను ఒలికిస్తూ రాయ్‌ లక్ష్మి .. వైరల్‌ ఫోటో..!

lakshmi raiఅవకాశాలు అందుకోవడానికి అందరు ముద్దుగుమ్మలు ఓ విధానాన్ని ఫాలో అవుతుంటే ఈ హాట్ భామ మాత్రం డిఫరెంట్ రూట్‌లో వెళ్తోంది. బాత్‌టబ్‌లో జలకాలాడుతూ వయ్యారాలు ఒలికిస్తోంది. జలకాలాటలలో..కిలకిల పాటలతో అంటూ నాటి సినిమాల్లో అప్సరసలందరూ సరిగంగ స్నానాలాడుతూ అప్పటి ప్రేక్షకులను మురిపించారు. అయితే ఈ జనరేషన్‌ జనాలకు అలాంటి హాట్ ఫీట్ చేయడానికి టాలీవుడ్ రత్తాలు రాయ్ లక్ష్మి సిద్ధమైపోయింది. అమ్మడు అంతటి అప్సరస కాకపోయినా అంతటి వయ్యారాలు ఒలికిస్తూ బాత్‌టబ్‌లో బ్యూటిఫుల్ భంగిమతో నెటిజన్లను ఆకర్షిస్తోంది. మరో ఇద్దరు అందాల భామల నడుమ హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారుకి మంచి కిక్కిస్తోంది.

కన్నడ కస్తూరి అయినప్పటికీ రాయ్‌ లక్ష్మి తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను తన అందాలతో మత్తెక్కించింది. ఆఖరికి బాలీవుడ్‌లోనూ సోయగాల ప్రదర్శనకు సిద్ధమైంది. హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయినా హాట్‌నెస్‌తో తన ఉనికిని చాటుకుంటోంది. అమ్మడు ప్రస్తుతం అందరు హాట్‌భామల తరహాలోనే సోషల్‌మీడియాలో రోజుకో హాట్ అవతారంతో నెటిజన్లను ఊరిస్తోంది. అందులో భాగంగానే రత్తాలు ఇప్పుడు బాత్‌టబ్‌ భంగిమతో యువకుల హృదయాలను వేడెక్కిస్తోంది.

ప్రస్తుతం టాప్‌ మోడల్స్‌తోకలిసి రాయ్ లక్ష్మి దిగిన ఓ ఫొటో యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. లెఫ్ట్‌లో పాపి జబ్బల్ అనే మోడల్, మరోవైపు సోనాలి సైగల్ అనే మరో సూపర్ మోడల్, రాయ్‌లక్ష్మి అందాలకు వంతపాడుతూ తమ వంతు అందాలను ఒలికిస్తూ ఆ ఫొటోకు మరింత వన్నె తెచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో తదేకంగా తిలకిస్తున్నారు కుర్రకారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!