HomeTelugu Trendingఅనుభవించు రాజా ఫస్ట్‌లుక్‌

అనుభవించు రాజా ఫస్ట్‌లుక్‌

Anubhavinchu raja first loo

రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్ వారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గవిరెడ్డి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో పందెం రాయుడుగా కనిపిస్తున్న రాజ్ తరుణ్.. మెడలో బంగారపు చైన్లు, చేతికి ఉంగరాలు మరియు బ్రాస్ లెట్ ధరించి ఉన్నాడు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని పందెం కోడిని నెమరుతూ ఉల్లాసంగా కనిపిస్తాడు. కాశిష్ ఖాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. గేయ రచయిత భాస్కరభట్ల సాహిత్యం రాస్తున్నారు.

గామీణ నేపథ్యంలో ఈ కథనడవనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ,అరియానా తదితరులు నటిస్తున్నారు. ‘ఉయ్యాల జంపాల’ ‘రంగులరాట్నం’ సినిమాల తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో రాజ్ తరుణ్ చేస్తున్న మూడో చిత్రం ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu