అంజలి కోసం రాజ్ తరుణ్!

మొన్నా మధ్య వరుస అతిథి పాత్రల్లో మెరిసిన రాజ్ తరుణ్ ఆ తరువాత ఏమనుకున్నాడో తెలియదు గానీ, ఇకపై అతిథి పాత్రలు చేయనని చెప్పాడు. కానీ మరో గెస్ట్ రోల్ లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా ఓ తమిళ చిత్రం కావడం విశేషం. జై, అంజలి జంటగా నటిస్తోన్న ‘బెలూన్’ అనే సినిమాలో ఓ అతిథి పాత్ర ఉందట. దర్శకుడు సినీష్ ఈ రోల్ కోసం రాజ్ తరుణ్ ను సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చెప్పేసాడట.

రీసెంట్ గా చెన్నై వెళ్ళి ఒక్క రోజులో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి వచ్చేశాడట. ఈ సినిమాలో జై మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. అసలు అతిథి పాత్రలు చేయనని చెప్పిన రాజ్ తరుణ్ ఈ సినిమా కోసం మాత్రం ఎందుకు ఒప్పుకున్నాడో.. తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే!