నేను నాస్తికుడిని: రాజమౌళి!

సినిమా వర్క్ ఉన్నంతవరకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఒకసారి వర్క్ పూర్తయిందంటే ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. గ్రాఫిక్స్ కారణంగా సినిమా రెండు వారాలు పోస్ట్ పోన్ చేద్దామా..? అని నిర్మాత శోభు గారిని అడిగాను అంటున్నాడు దర్శకుడు రాజమౌళి. ఆయన డైరెక్ట్ చేసిన బాహుబలి2 చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఆరు వేల థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి విలేకర్లతో ముచ్చటించారు.
ఎగ్జైట్మెంట్ అప్పటివరకే..
సినిమా వర్క్ ఉన్నంతవరకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఒకసారి వర్క్ పూర్తయిందంటే ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. గ్రాఫిక్స్ కారణంగా సినిమా రెండు వారాలు పోస్ట్ పోన్ చేద్దామా..? అని నిర్మాత శోభు గారిని అడిగాను. కానీ ఆయన నవ్వుతూ అనుకున్న టైమ్ కి అన్నీ సెట్ అవుతాయని అన్నారు.
ఇది సీక్వెల్ కాదు..
బాహుబలి2 అనేది సీక్వెల్ కాదు. ఒక కథను చెప్పాలనుకున్నప్పుడు ఒక సినిమాలో చెప్పలేక రెండు భాగాలుగా చెప్పాలనుకున్నాను. అందరం కలిసి ఒకటిగా పని చేయడంతో సినిమా బరువుగా ఎక్కడా అనిపించలేదు.
ఆటంబాంబ్ లా పేలింది..
సినిమా మొదటి పార్ట్ చేసినప్పుడు మంచి ఎండింగ్ ఇవ్వాలనుకున్నా.. కట్టప్ప బహుబలిని పొడవడం చూపించాం. అది మంచి ఝలక్ అవుతుందనుకున్నాను కానీ ఆటంబాంబ్ లా పేలుతుందనుకోలేదు.
ఇంత గ్యాప్ ఊహించలేదు..
రెండేళ్ల పాటు పార్ట్2 కోసం ఎదురుచూశారు ప్రేక్షకులు. నిజానికి ఇంత గ్యాప్ వస్తుందని మేము కూడా అనుకోలేదు. మొదటి పార్ట్ విడుదలైన 4 నెలల్లో రెండో భాగం విడుదల చేయాలనుకున్నాం. కానీ బడ్జెట్ ఇతరత్రా సమస్యల వలన కుదరలేదు.
నాకు సంతృప్తినిచ్చింది..
ఒక దర్శకుడిగా కథను చెప్పడంలో నాకు ఈ సినిమా పూర్తి సంతృప్తినిచ్చింది. నా ప్రతి సినిమా కూడా హీరో సెంట్రిక్ గా ఉంటాయి. కానీ బాహుబలిలో కావల్సినంత హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే మిగిలిన పాత్రల ప్రాముఖ్యత కూడా చెప్పే అవకాశం ఉంది.
గర్వంగా అనిపిస్తుంది..
సౌత్ సినిమా అంటే బయట దేశాల్లో పెద్దగా తెలియదు. బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ పేరు వరకు చెప్తారేమో.. ప్రాంతీయ భాషల సినిమాల గురించి మాట్లాడరు. కానీ బాహుబలి ఇండియన్ సినిమా స్థాయిని పెంచింది. వేరే దేశాల్లో తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది.
మహాభారతం చేయాలి..
దర్శకుడిగా నా గోల్స్, ఆంబిషన్స్ అన్నీ నెరవేరాయి. అయితే మహాభారతం సినిమా చేయాలనుంది. కానీ అది ఇప్పట్లో కాదు. ఆ సినిమా చేయడానికి మరో పదేళ్ళ అనుభవం అయినా కావాలి.
నేను నాస్తికుడిని..
నా దృష్టిలో భక్తి అనేది స్టాంగ్ ఎమోషన్. దర్శకుడిగా ఆ ఎమోషన్స్ ను తెరపై చూపించాలనుకుంటాను.
కానీ నేను దేవుడ్ని నమ్మను.. నా కుటుంబం నమ్ముతుంది.