అతడు రాజమౌళి సొంత కొడుకు కాదు!

మనకు తెలిసినంత వరకు రాజమౌళికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఎలాంటి హెచ్చు చూపించకుండా పిల్లలను కూడా చాలా పద్ధతిగా పెంచారనే మంచి పేరు ఉంది. కొన్ని రోజుల క్రితం రాజమౌళి కొడుకు కార్తికేయ సినిమాల్లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా పక్కన పెడితే నిజానికి కార్తికేయ, రాజమౌళి సొంత కొడుకు కాదట. రమాకు
రాజమౌళితే వివాహం అయ్యే సమయనికే ఆమెకు కొడుకు ఉన్నాడట.

ఆ బిడ్డను తన సొంత కొడుకులా రాజమౌళి స్వీకరించాడని రమా రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయం ఇప్పటివరకు చాలా తక్కువ మందికే తెలుసు. రమా ఇంటర్వ్యూలో పబ్లిక్ గా చెప్పడంతో చాలా మందికి ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.