
సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజినీకాంత్ తన 170 వ సినిమా అప్‌డేట్ అందించి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. తలైవా 169వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుబాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ ప్రకటన చేశారు. జై భీమ్ లాంటి సూపర్ హిట్ సోషల్ డ్రామాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేళ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఏడు పదుల వయస్సు దాటినా ఫుల్ ఎనర్జీతో యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్త.. అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. సూపర్ స్టార్ 170 ప్రాజెక్ట్ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ మూవీ ప్రొడక్షన్ పనులను వన్ ఆఫ్ ది లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ జీకేఎం తమిళ్ కుమరన్ పర్యవేక్షించనున్నారు. మొత్తానికి ఈ సారి టీజే జ్ఞానవేళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













