సందీప్ కిషన్ కు రజినీ కాంప్లిమెంట్!

ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ కు సరైన హిట్ సినిమా పడలేదు. దీంతో తమిళంలో లోకేశ్ దర్శకత్వంలో ‘మా నగరం’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాతో ఎలా అయినా.. హిట్ వస్తుందనే నమ్మకంతో చేశాడు. ఈ సినిమాను తెలుగులో ‘నగరం’ అనే పేరుతో విడుదల చేశాడు. రెండు బాషల్లోని సినిమాకు మంచి స్పందనే లభించింది. అనూహ్యమైన మలుపులతో రూపొందిన ఈ సినిమాకు ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా స్పెషల్ షోను రజినీకాంత్ కు చూశారట.

సినిమా చూసిన ఆయన కథ, కథనాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని నటీనటులను, సాంకేతిక నిపుణులను అభినందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సందీప్ కిషన్ ను ఆయన ఎంతగానో ప్రశంసించారట. సూపర్ స్టార్ కి తన సినిమా నచ్చడం, తన నటన గురించి ఆయన మాట్లాడడంతో సందీప్ తెగ సంబరపడిపోతున్నాడు. ఇలానే సందీప్ తన సక్సెస్ బాటను కొనసాగిస్తారేమో చూడాలి!