అక్కినేని ఫ్యామిలీలో ఈగో ప్రాబ్లమ్స్!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాల్లో అక్కినేని కుటుంబం ఒకటి. ప్రస్తుతం ఈ కుటుంబానికి చెందిన మూడో జెనరేషన్ హీరోలు తన సత్తాను చాటుతున్నారు. నాగార్జున ఇప్పటికీ తన కొడుకులకు పోటీ ఇస్తూనే ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య, అఖిల్ లతో పాటు మరో యంగ్ హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. తను నటించిన నాలుగు సినిమాల్లో ఏది కూడా
సుశాంత్ మంచి హిట్ ను ఇవ్వలేకపోయింది. ఆటాడుకుందాం రా సినిమా సమయంలో చైతు, అఖిల్ క్రేజ్ వాడుకోవాలని ఆ చిత్ర నిర్మాత వారితో క్యామియో రోల్స్ చేయించాడు.

సినిమా రిలీజ్ టైమ్ లో సుశాంత్ తో పాటు ఆ ఇద్దరు హీరోలతో ఉన్న పెద్ద పోస్టర్స్ రిలీజ్ చేశారు. దీంతో సుశాంత్ ఈ సినిమాలో హీరో నేనా..? వాళ్ళా..? అంటూ నిర్మాతపై కోప్పడినట్లు సమాచారం. నిజానికి అదే నిర్మాత సుశాంత్ తో వరుసగా నాలుగు సినిమా చేశాడు. దీంతో నిర్మాతకు హర్ట్ అయి.. తన తదుపరి సినిమా చైతుతో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీంతో సుశాంత్ ఆ నిర్మాతతో ఉన్న వారి వ్యాపార లెక్కలు చెప్పమని.. ఏదైనా తేడా వస్తే ఊరుకునేదే లేదని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడట. మొత్తానికి ఈ ఇన్సిడెంట్ తో మూడో జనరేషన్ లో ఈగో సమస్యలు మొదలయ్యాయని తెలుస్తోంది!