HomeTelugu Trending'జైలర్‌' మూవీ మేకింగ్‌ గ్లింప్స్‌ విడుదల

‘జైలర్‌’ మూవీ మేకింగ్‌ గ్లింప్స్‌ విడుదల

Rajinikanth jailer glimpse

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్‌’. నెల్సన్‌ కుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజాగా చిత్ర బృందం మేకింగ్‌ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకుంది. వీడియోలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ అదిరిపోయే లుక్ లో కనిపించారు.

సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu