నాలుగు సినిమాలపై పవన్ దృష్టి..!

పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల నాటికి వీలైనన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ఇందులో
భాగంగా ముందుగా డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యాక్షన్
నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాతో పవన్ మరో మూడు సినిమాలను
రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. 2019 నాటికి కనీసం నాలుగు చిత్రాలను రిలీజ్ చేయాలనేది
పవన్ ప్లాన్. కాటమరాయుడు సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సినిమా
చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను తన రాజకీయ జీవితానికి
దోహద పడేలా ఉండాలని జాగ్రత్తలు పడుతున్నాడు. అలానే దాసరి నిర్మాణంలో ఓ సినిమా
చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేయనున్నారనే విషయం తెలియాల్సివుంది.
అలానే మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు. కాటమరాయుడు, త్రివిక్రమ్ సినిమాలను
2017లో విడుదల చేసి మిగిలిన రెండు సినిమాలు 2018నాటికి విడుదల చేయడానికి
సిద్ధపడుతున్నాడు.