HomeTelugu Trendingవేశ్య పాత్రలో మన్మధుడు బ్యూటీ

వేశ్య పాత్రలో మన్మధుడు బ్యూటీ

rakhul as a prostitute role
నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు దక్షిణాదిలో అవకాశాలు తగ్గటంతో బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే బోల్డ్ క్యారెక్టర్‌లో నటించేందుకు కూడా సిద్ధమవుతోంది. రకుల్‌ ప్రీత్‌కు ఓ వేశ్య పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఓ ప్రముఖ వేశ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న సినిమాలో రకుల్ ప్రధాన పాత్ర పోషించబోతుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో వెంటనే ఓకే చెప్పిందట. ఇప్పటికే బాలీవుడ్‌లో మర్జవాన్ చిత్రంలో మోడ్రన్ వేశ్య పాత్రలో నటించింది. మరోసారి అలాంటి పాత్ర చేయబోతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన రకుల్ ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడికి ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం తమిళంలో భారతీయుడు-2లో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!