వినాయక్ కు మెగా గిఫ్ట్!

సినిమా పెద్ద హిట్ అయిందంటే చాలు.. మన హీరోలు దర్శకులకు భారీ గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు. శ్రీమంతుడు సినిమా సమయంలో మహేష్, కొరటాల శివకు కాస్ట్లీ కార్ ప్రెజంట్ చేశాడు. అలానే జనతాగ్యారేజ్ సినిమాకు ఎన్టీఆర్ కూడా తన డైరెక్టర్ కొరటాలకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు అలానే చరణ్, వినాయక్ కు ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. చాలా గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఇటీవలే ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడమే కాకుండా, 100 కోట్లకి పైగా వసూలు చేసింది. ఈ సినిమా విజయంలో దర్శకుడిగా వినాయక్ ప్రధానమైన పాత్రను పోషించాడు. దాంతో ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించిన చరణ్, తన సంతోషం కొద్దీ వినాయక్ కి ఒక ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. మరి ఆ గిఫ్ట్ ఖరీదైన కారో.. లేక అపార్ట్మెంటో.. తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!