ఎన్టీఆర్‌కు రామ్‌ చరణ్ శుభాకాంక్షలు ‌.. ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముశులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ కూడా ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అతనితో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశాడు. కాగా వీరిద్దరు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొమరం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం నుండి ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఏదైనా స్పెషల్ ట్రీట్ ఇద్దామనుకున్నారు కానీ కరోనా కారణంగా ఇవ్వలేకపోయినట్టు వివరణ ఇచ్చారు. మొత్తానికి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ షేర్ చేసిన ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.