సిక్స్ ప్యాక్ లో కనిపించనున్న చరణ్!

రామ్ చరణ్ ప్రస్తుతం తని ఒరువన్ తమిళ చిత్రం రీమేక్ ‘దృవ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ విషయంలో చరణ్ బాగా శ్రద్ధ తీసుకుంటున్నాడని, మరింత ఫిట్ నెస్ తో కనిపించడానికి ఎంతో కేర్ తీసుకున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా టైటిల్ సాంగ్ లో చరణ్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడనేది సమాచారం.

బ్రూస్ లీ సినిమాలో కూడా చరణ్ మంచి ఫిట్ నెస్ తో కనిపించాడు. అయితే ఆ సినిమా కథ, కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో చరణ్ లుక్ కి కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దృవ సినిమాలో ఇప్పటికే చరణ్ లుక్ కి మంచి మార్కులు పడ్డాయి.

టైటిల్ సాంగ్ ను చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి చరణ్ సిక్స్ ప్యాక్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సినిమాకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.