రామ్‌ మహిళా అభిమానులు నన్ను చంపేస్తారేమో: ఛార్మి

యంగ్‌ హీరో రామ్‌ చాలా శ్రమించే నటుడని నటి ఛార్మి అన్నారు. రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్‌లు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని
నిర్వహించారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

కాగా ఈ సినిమా సెట్‌లో తీసిన ఫొటోను ఛార్మి సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అందులో రామ్‌ మాస్క్‌ ధరించి కనిపించారు. ‘రామ్‌ చాలా శ్రమించే నటుడు. నీ పాజిటివిటీ, ఎనర్జీ నాకు నచ్చింది రామ్‌. నీకు సంబంధించిన (వ్యక్తిత్వాన్ని ఉద్దేశిస్తూ) ప్రతిదీ నాకు చాలా నచ్చింది. ఇలా మాట్లాడినందుకు నీ మహిళా అభిమానులు నన్ను చంపకుండా ఉంటారని ఆశిస్తున్నా (నవ్వుతూ)’ అని ఛార్మి ట్వీట్‌ చేశారు.