రాముడిగా చరణ్ లుక్ చూశారా..?

సినిమాలకు సంబందించిన అనౌన్స్మెంట్ రాగానే హీరోల అభిమానులు సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను సొంతంగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ ఉంటారు. ఒక్కోసారి ఒరిజినల్ సినిమా స్టిల్స్ కంటే ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ బాగా క్లిక్ అవుతున్నాయి. ఇటీవల పవన్ కు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేసి టైటిల్ కూడా ‘గోకుల కృష్ణుడు’ అనే పెట్టాశారు. అలానే చిరంజీవి నటించనున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాకు సంబందించి ఓ పోస్టర్ చేశారు. ఆ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. అంత క్రియేటివిటీతో డిజైన్ చేశారు.
తాజాగా రామ్ చరణ్ లుక్ ఒకటి డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ రాముడి వేషంలో కనిపిస్తున్నాడు. తాజాగా అల్లు అరవింద్ 500 కోట్ల బడ్జెట్ తో రామాయణాన్ని రూపొందిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటీనటులు ఎవరనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈలోగా అభిమానులు రాముడి పాత్రకి గానూ రామ్ చరణ్ ను ఫిక్స్ అయిపోయి పోస్టర్స్ కూడా డిజైన్ చేసేశారు. మరి అల్లు అరవింద్ మనసులో ఉన్న రాముడు ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!