HomeTelugu Trendingమహేష్‌ సినిమాలో రమ్యకృష్ణ!

మహేష్‌ సినిమాలో రమ్యకృష్ణ!

Ramya Krishna in Mahesh ba

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన 28వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే అనేకమంది టాలెంటెడ్ నటీనటులను తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కూడా భాగం కానున్నట్లు తెలుస్తుంది. ఆమె పాత్ర సినిమాలో పవర్ ఫుల్ గా ఉండబోతుందని అంటున్నారు.

నిజానికి ఈ కథని చాన్నాళ్ల క్రితమే రమ్యకృష్ణకు త్రివిక్రమ్ వినిపించాడు. కానీ అప్పట్లో ఆమె అంతగా ఆసక్తి చూపించలేదని అయితే ఇప్పుడు ఆమె నుంచే త్రివిక్రమ్ కు కబురు వెళ్లి తాను సినిమాలో నటిస్తాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్‌ ప్రతి సినిమాలో ఒక సీనియర్ నటిని బలమైన క్యారెక్టర్ ద్వారా చూపిస్తాడు.

అత్తారింటికి దారేది సినిమాతో నదియా, అజ్ఞాతవాసి సినిమాతో కుష్బూ, అలవైకుంఠపురం సినిమాతో టాబు వంటి వారు కూడా తెలుగులో బలమైన పాత్రతో రీఎంట్రీ ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు ఇదే రేంజ్‌లో మహేష్‌ సినిమా రమ్యకృష్ణ పాత్ర కూడా డిజైన్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ శీవార్లలో చేసిన భారీ సెటింగ్‌లో సోమవారం నుంచి ఈ సినిమా షూటింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu