HomeTelugu Newsవెబ్‌సిరీస్‌లో రానా, శ్రుతిహాసన్

వెబ్‌సిరీస్‌లో రానా, శ్రుతిహాసన్

Rana and Shruti Hassan in Web series
హీరో రానా, శ్రుతి హాసన్ కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. థ్రిల్లర్ కథాంశంతో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కనుంది. తెలుగులో దీన్ని తెరకెక్కిస్తున్నారట. నెట్‌ఫ్లిక్స్ నిర్మించబోతుందట. వెబ్‌సిరీస్‌ను ముందుగా తెలుగు భాషలో చిత్రీకరించి తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయనున్నారట. అంతేకాకుండా హీరో రానా వరుస సినిమాల్లో నటించబోతున్నాడు. త్వరలో అరణ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు దర్శకత్వంలో విరాటపర్వం చిత్రంలోనూ నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో మరో చిత్రం ‘హిరణ్య కశ్యప’ను సురేష్‌ బాబు తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!