HomeTelugu Trendingకొత్త పెళ్లికొడుకు రణ్‌బీర్‌ కపూర్‌ మూవీ.. షూటింగ్‌లో ప్రారంభం

కొత్త పెళ్లికొడుకు రణ్‌బీర్‌ కపూర్‌ మూవీ.. షూటింగ్‌లో ప్రారంభం

Ranbir kapoor Animal movie
అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్‌’. ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ కోసం మూవీ టీం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో ల్యాండ్‌ అయ్యింది. పెళ్లి తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌ చేస్తున్న ఫస్ట్‌ మూవీ ఇది. ఇటీవలో అలియాతో పెళ్లి పీట‌కెక్కిన రణ్‌బీర్‌ ఏ మాత్రం గ్యాప్‌ తీసుకోకుండా వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఇక మనాలి వెళ్లిన మూవీ టీంకు అక్కడి స్థానిక యంత్రాంగం సాంప్రదాయబద్దంగా ఘనస్వాగతం పలికింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ పాత్ర విభిన్నంగా ఉంటుందని మూవీ టీం పేర్కొంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ మొదటి వారం కలెక్షన్లు..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!