దుష్ప్రచారం భాదిస్తోంది: రణ్‌బీర్‌కపూర్‌

నటుడు రణ్‌బీర్‌కపూర్‌ ‘జగ్గా జాసూస్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో దర్శకుడు అనురాగ్ బసును గట్టిగా వాటేసుకొని లిప్ కిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌కపూర్‌ అలా చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. రణ్‌బీర్‌ మీద నెటిజన్స్ చేస్తోన్న కామెంట్స్ చదివితే తప్ప అతడికి తన ఇమేజ్ డ్యామేజ్ అయిందనే సంగతి తెలియలేదు. ఈ విషయంపై స్పందించిన రణ్‌బీర్‌ ”జరిగిన సంఘటనని సరదాగా తీసుకోవాలే తప్ప సీరియస్ చేయాల్సిన అవసరం ఏముంది. నేనేమీ తేడా కాదు.. హోమో సెక్సువల్ అనీ.. మరొకటనీ సోషల్ మీడియాలో నన్ను ఉద్దేశించి చేస్తోన్న దుష్ప్రచారం బాధిస్తోంది” అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినా.. రణ్‌బీర్ కు ఇటువంటి కొత్తేమీ కాదు. గతంలో కూడా అతడు ఇలాంటి చేష్టలు చేసి బుక్కయిన సంధర్భాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రణ్‌బీర్‌కపూర్‌ కు, కత్రినాకు మధ్య ఉన్న బంధం తెగడంతో వారిద్దరిని పెట్టి సినిమా చిత్రీకరించడానికి అనురాగ్ కు తల ప్రాణం తోకకు వచ్చిందట.