HomeTelugu Newsనా కెరీర్‌లో 'రంగు' బెస్ట్‌ చిత్రం: తనీష్‌

నా కెరీర్‌లో ‘రంగు’ బెస్ట్‌ చిత్రం: తనీష్‌

యువ నటుడు తనీష్‌ నటించిన తాజా చిత్రం ‘రంగు’. విజయవాడకు చెందిన లారా అనే రౌడీ షీటర్ జీవితాధారంగా ఈ సినిమాని కార్తికేయ తెరకెక్కించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో తనీష్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా తనీష్‌ మాట్లాడుతూ..’ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఓ ఎత్తు. ‘రంగు’ సినిమా మరో ఎత్తు. నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ చిత్రం. ఈ సినిమా చూశాక మా అమ్మ ఏడ్చేసింది. చాలా మంచి సినిమా చేశావురా అని మెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆఖరి అరగంట పాటు వచ్చే సన్నివేశాలే ప్రధాన బలం. కచ్చితంగా ప్రేక్షకుడు చెమర్చిన కళ్లతో థియేటర్‌ నుంచి బయటకు వస్తాడని చెప్పగలను.

10 11

రౌడీషీటర్‌ లారా అనగానే అందరికీ అతనిపై నెగిటివ్‌ అభిప్రాయాలు ఏర్పడతాయి. కానీ సినిమా చూసిన తర్వాత ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది. ఈ సినిమా తెరకెక్కించామని తెలిసి లారా కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని పిలిపించి మాట్లాడి సినిమా చూపించాం. ఓ రెండు సన్నివేశాల్లోని కొన్నిపదాలను మ్యూట్‌ చేయమని చెప్పారు. అందుకు దర్శకుడు కూడా ఒప్పుకొన్నారు. అంతేకాదు విజయవాడలో ఈ సినిమాను తామే ప్రచారం చేస్తామని చెప్పారు కూడా. లారా జీవితంలో చోటుచేసుకున్న సన్నివేశాలు, పోలీసులు అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? తదితర విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మున్ముందు జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటానని మాటిస్తున్నాను. గతంలో చేసిన తప్పిదాలను చేయను’ అని తనీష్‌ వెల్లడించాడు‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!