‘రారండోయ్‌ వేడుక చూద్దాం’!

నాగచైతన్య హీరోగా కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ఉగాది పండగ రోజున ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ టైటిల్‌ని ఫిక్స్‌ చేసినట్టుగా అనౌన్స్‌ చేశారు. ఈ సందర్భంగా ఈచిత్రానికి సంబంధించి రెండు పోస్టర్స్‌ను ఫస్ట్‌ లుక్‌గా విడుదల చేశారు. ఇటు ప్రేక్షకుల్ని, అటు అభిమానుల్ని ఈ లుక్స్‌ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రం ప్రోగ్రెస్‌ గురించి దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల తెలియజేస్తూ.. ”ఇప్పటివరకు 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఏప్రిల్‌ ఎండ్‌ వరకు జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లానింగ్‌ జరుగుతోంది. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో మరో భారీ చిత్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. నాగచైతన్య కెరీర్‌లో ఇది ఓ మెమరబుల్‌ మూవీ అవుతుంది. దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్న చిత్రమిది. కమర్షియల్‌గా డెఫినెట్‌గా చాలా మంచి సినిమా అవుతుంది” అన్నారు.