HomeTelugu News'డిస్కోరాజా' గా రవితేజ

‘డిస్కోరాజా’ గా రవితేజ

1 25రాజా ది గ్రేట్‌ తర్వాత మరో హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్‌ మహారాజ్‌ రవితేజ. అయితే తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేశారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్‌ లోగోను విడుదల చేశారు. ‘డిస్కోరాజా’ గా వస్తున్న ఈ సినిమా లోగోను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

లోగోలో రవితేజ పేరు కింద ‘is’ రాసి దాన్ని కొట్టేసి ‘was’ అని రాసి ఉంది. టైటిల్‌ కింద రివైండ్.. ఫార్వర్డ్‌.. కిల్‌ అనే ఆప్షన్లను చూస్తుంటే పూర్వజన్మల నేపథ్యంలో సినిమా సాగుతుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఎక్కడకు పోతావు చినవాడా’ ఫేం వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాల్లూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు

‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో హిట్‌ అందుకున్న రవితేజ ఆ తర్వాత నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ ఆశించిన విజయాన్ని సాధించలేదు. మరి ఈ సినిమాతోనైనా రవితేజ హిట్‌ అందుకుంటారో లేదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!