HomeTelugu Trendingరవితేజ బాలీవుడ్‌ ఎంట్రీ!

రవితేజ బాలీవుడ్‌ ఎంట్రీ!

Ravi Tejas Bollywood entry

ప్రస్తుతం బాలీవుడ్‌ కన్ను టాలీవుడ్‌ హీరోలపై కన్ను పడింది. బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు హిందీ సినిమాల్లో తెలుగు హీరోలను నటింపజేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. గతేడాది బ్రహ్మస్త్రలో నాగార్జున కీలకపాత్ర పోషించగా.. ఇక్కడ ఈ సినిమాకు కాసుల వర్షం కురిసింది. లాల్‌ సింగ్‌ చడ్డాలో నాగచైతన్య కీలకపాత్ర పోషించాడు. అయితే ఇది బాక్సాఫీస్‌ దగ్గర తేడా కొట్టింది.

ఇక ఇప్పుడు సల్మాన్‌ కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాలో వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తుండగా.. చరణ్‌.. అతిథి పాత్రలో నటిస్తున్నాడు. కాగా తాజాగా మరో తెలుగు హీరోపై బాలీవుడ్‌ మేకర్ ఖర్చీఫ్ వేశారు.టాలీవుడ్‌ మాస్‌ మహారాజా రవితేజతో హిందీ మేకర్స్‌ ఓ రీమేక్‌ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ధావణ్‌తో కలిసి రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

రెండేళ్ళ క్రితం తమిళంలో కాసుల వర్షం కురిపించిన మానాడు సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు. కాగా అందులో శింబు పాత్రలో వరుణ్‌ చేయగా.. ఎస్‌.జే సూర్య రోల్‌ను రవితేజ చేయనున్నాడట. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయట. ఈ సినిమాను రానా, ఏషియన్‌ సునీల్‌తో కలిసి కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్నాడట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu