
Vishwambhara and Raja Saab:
చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మరియు ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలు చాలాకాలంగా నిర్మాణంలోనే ఉన్నాయి. కానీ ఇంకా రిలీజ్ డేట్‌పై స్పష్టత రాలేదు.
‘విశ్వంభర’ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం వీఎఫ్ఎక్స్. టీజర్ రాగానే వీఎఫ్ఎక్స్ మీద ట్రోలింగ్ మొదలైంది. దీంతో డైరెక్టర్ వశిష్ఠ టీం వెంటనే స్పందించి, హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ స్టూడియోలకు ప్రాజెక్ట్‌ను అప్పగించారు. అవి “అవతార్”లాంటి పెద్ద సినిమాలపై పని చేసిన స్టూడియోస్ కావడంతో, అవి పూర్తి చేయటానికి కొన్ని నెలలు పడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమా ఈ ఏడాది లోపలే రిలీజ్ అవుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి.
ఇక మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ కూడా వీఎఫ్ఎక్స్ పనులలోనే స్లోగా పోతున్నట్టు సమాచారం. దర్శకుడు మారుతీ అన్నట్టుగా, వీఎఫ్ఎక్స్ టీంస్ నుంచి క్లారిటీ వచ్చిన తరువాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తారట. ఈ సినిమా కూడా మూడు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంది.
మరికొంత మంది సరదాగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా ‘విశ్వంభర’ కన్నా ముందే వచ్చేస్తుందేమో అని జోక్ చేస్తున్నారు.
కానీ అభిమానులకు మాత్రం నిరీక్షణ మరోసారి సాగనుంది. ఏది ఏమైనా, రెండు సినిమాల టీంలు ఈ ఏడాది చివరికి సినిమాలు రిలీజ్ చేయాలని కష్టపడుతున్నారని సమాచారం.
ALSO READ: ఒకే ఒక్క సన్నివేశం కోసం Thalapathy Vijay ఇంత పెట్టి రీమేక్ రైట్స్ కొన్నారా?