మహేష్‌ బాబుపై పూరి జగన్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు

దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా కాలం తరువాత మరలా హిట్ అందుకున్నాడు. టెంపర్ తరువాత సరైన హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా ఇస్మార్ట్ శంకర్ వరకు ఆగాల్సి వచ్చింది. ఎట్టకేలకు హిట్ దక్కడంతో పూరి పండుగ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ సినిమా ఏర్పాట్లలో ఉన్నాడు. అయితే, పూరి డ్రీం ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అదే జనగణమన.

ఈ సినిమాను మహేష్ బాబుతో చేద్దామని అనుకున్నాడు. కానీ, పూరికి అవకాశం ఇవ్వలేదట. గతంలో పూరితో మహేష్ బాబు రెండు సినిమాలు చేశారు. ఆ రెండు ఆల్ టైం హిట్టే. ఒకటి పోకిరి, రెండోది బిజినెస్ మెన్. మహేష్ తో మూడో సినిమా చేయమని ఫ్యాన్స్ అడుగుతున్నా.. మహేష్ బాబు అవకాశం ఇవ్వడం లేదని, హిట్స్ లో ఉన్నప్పుడే మహేష్ అవకాశం ఇస్తారని అన్నారు పూరి జగన్నాథ్.

మహేష్ తో పోకిరి సినిమా చేసే సమయానికి.. పూరి మూడు సినిమాలు ప్లాప్ లో ఉన్నాయి. ఆంధ్రావాలా, 143, సూపర్ సినిమాలు ప్లాపైనా మహేష్ పోకిరి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా హిట్టైంది. ఆ తరువాత బిజినెస్ మెన్ కు ముందు ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ తరువాత మహేష్ తో బిజినెస్ మెన్ చేశారు. ప్లాప్ లో ఉన్నకాని అవకాశాలు ఇచ్చారు మహేష్. మరి హిట్స్ లో ఉంటేనే మహేష్ అవకాశం ఇస్తాడని పూరి అనడం వెనుక ఆంతర్యం ఏంటో తెలియదు.