మహేష్ క్రేజ్ కు నిదర్శనం!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్, మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘సంభవామి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ ను అహ్మదాబాద్ లో పూర్తి చేశారు. దీని తరువాత చిన్న బ్రేక్ తీసుకున్న టీం రేపటి నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ అప్పుడే మొదలైపోయింది. ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం చాలా ఛానల్స్ పోటీ పడ్డాయి. చివరగా జీటీవీ వారు దాదాపు 26 కోట్లు పెట్టి ఈ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇంత మొత్తం చెల్లించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో మరోసారి మహేష్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రూవ్ అయింది. ఈ సినిమాతో ఆయన స్థాయి మరింత పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.