
Jr NTR War 2 Telugu Rights:
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా పండగే! యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బీ టౌన్ లో అడుగు పెడుతున్నాడు. అదే “వార్ 2” సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేస్తున్నాడు. ఆగస్టు 14, 2025 రిలీజ్ కి సెట్ అయిన ఈ సినిమా, రిలీజ్ కి ముందే బాక్సాఫీస్ వద్ద హైప్ క్రియేట్ చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా చుట్టూ భలే హంగామా నడుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నాడంటే చాలు – పాటలు, ఫైట్లు, డ్యాన్స్ అన్నీ మాస్ తో నిండిపోతాయి. అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే సెలబ్రేషన్స్ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు.
ఇదిగో, ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే… ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం ఇద్దరు పెద్ద నిర్మాతలు పోటీలో ఉన్నారు. ఒకరు సితార ఎంటర్టైన్‌మెంట్స్ నుండి నాగ వంశీ, మరొకరు ఏషియన్ సినిమాస్ నుండి సునీల్ నారంగ్. వీరిద్దరూ దాదాపు రూ.120 కోట్ల వరకూ ఇచ్చేందుకు రెడీ అవ్వడంతో ఇది రికార్డు ధరగానే మారింది.
అంత పెద్ద మొత్తం ఒక్క తెలుగు వెర్షన్ కోసమా? అనేది కొంతమంది సందేహిస్తున్నారు. అయినా కూడా, ఎన్టీఆర్ క్రేజ్ చూసి డిస్ట్రిబ్యూటర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. హృతిక్ తోపాటు ఎన్టీఆర్ స్క్రీన్ పై ఉన్నాడంటే టికెట్లు హౌస్‌ఫుల్ కావడం ఖాయం అంటున్నారు.
ఈ రైట్స్ ఎవరు గెలుస్తారో ఇంకా క్లారిటీ రాలేదు కానీ, కొన్ని రోజుల్లో ఫైనల్ డీల్ అయ్యే అవకాశముంది. ఏదేమైనా, “వార్ 2” రిలీజ్ కు ముందే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు!
ALSO READ: Samantha దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు ఏంటో తెలిస్తే షాకే..