
Jr NTR first salary:
జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ శక్తిమంతమైన నటుడిగా గుర్తింపు ఉంది. ఈరోజు, మే 20, ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరంగా జరుపుకుంటున్నారు. మరోవైపు, ఆయన తొలి బాలీవుడ్ సినిమా వార్ 2 టీజర్ కూడా ఈ రోజు విడుదల కావడం ప్రత్యేక ఆకర్షణ.
ఎన్టీఆర్ కెరీర్ ఎలా మొదలైందో మీకు తెలుసా? 2001లో నిన్ను చూడలేని అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. అప్పుడెప్పుడు ఆయన వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే! ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయినప్పటికీ, ఆయన టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ఇది ఒక వేదిక అయ్యింది. ఆ సినిమాకు ఆయనకు రూ. 4 లక్షలు పారితోషికంగా ఇచ్చారు. ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక, ఆ మొత్తాన్ని తన అమ్మకు ఇచ్చేశాడట!
View this post on Instagram
ఆ తర్వాత స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి లాంటి హిట్ సినిమాలతో ఎన్టీఆర్ స్టార్‌హీరోగా ఎదిగాడు. ముఖ్యంగా RRR లో ఆయన పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమా కోసం ఆయన రూ. 45 కోట్లు పారితోషికం తీసుకున్నాడు.
ఇప్పుడు ఆయన దేవర మరియు వార్ 2 సినిమాల కోసం దాదాపు రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. చిన్న ఆరంభం నుంచి ఇలా స్టార్ స్థాయికి ఎదగడం నిజంగా ప్రేరణదాయకం.
ఇంకా విశేషం ఏంటంటే, ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న Made in India చిత్రంలో దాదాసాహెబ్ ఫాల్కే పాత్ర పోషించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ALSO READ: Shah Rukh Khan’s King సినిమా నటీనటుల జాబితా చూస్తే షాక్ అవ్వాల్సిందే..