HomeTelugu Big StoriesWar 2 లో జూ.ఎన్టీఆర్ పాత్ర ఏమిటంటే..!

War 2 లో జూ.ఎన్టీఆర్ పాత్ర ఏమిటంటే..!

Interesting update about NTR role in War 2
Interesting update about NTR role in War 2

NTR role in War 2:

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. హృతిక్ రోషన్ లీడ్ రోల్‌లో వస్తున్న War 2 లో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో షూటింగ్ దశలో ఉంది.

సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఆయన “వీరేంద్ర రఘునాథ్” అనే సౌత్ ఇండియన్ రా ఏజెంట్ రోల్ చేస్తున్నారు. కానీ ఈ క్యారెక్టర్ ఓ అనూహ్య మలుపు తీసుకుని రోగ్ ఏజెంట్‌గా మారిపోతాడట. అంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ షేడ్‌లో కనిపించే అవకాశం ఉంది.

హృతిక్ రోషన్ పోషించే కేబీ (కబీర్) క్యారెక్టర్‌తో ఎన్టీఆర్ స్ట్రాంగ్ ఫేస్‌ఆఫ్ సీన్స్ ఉంటాయట. అంటే స్క్రీన్‌పై పవర్‌ఫుల్ క్లాష్ ఉండబోతోందన్నమాట. ఈ మూవీకి Brahmāstra ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు.

వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ క్యారెక్టర్ చేయడం పట్ల ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఆయన పాత్ర గట్టిపోటీ ఇవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. హృతిక్-ఎన్టీఆర్ కాంబో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేపుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు ఎన్టీఆర్ చేస్తున్న హై ఓల్టేజ్ ఎంట్రీగా ఈ సినిమా సంచలనంగా మారనుంది.

ALSO READ: విశ్వక్ సేన్ Laila కి పెద్ద సమస్య.. విడుదల కష్టమేనా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu