HomeTelugu Trendingఆ పాత్రలు చేయాలని ఉందంటున్న రెజీనా!

ఆ పాత్రలు చేయాలని ఉందంటున్న రెజీనా!

5 13
టాలీవుడ్‌లో ఇప్పటి దాకా దాదాపు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసింది రెజీనా కసాండ్రా. అయితే అనుకున్నంత విజయాలు అందుకోకపోయినప్పటికీ, అమ్మడు తన అందంతో కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. దీంతో రెజీనా తన రూట్ పూర్తిగా మార్చేసింది. రొటీన్ కి భిన్నంగా అడుగులు వేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ తన పాత్రల ఎంపికపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. గ్లామర్ గా కనిపించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది.అంతేగాక హీరోయిన్ పాత్ర ఘాటుగా.. .. బోల్డ్ పాత్రలు చేయాలని ఉందని వివరణ ఇచ్చింది. బాలీవుడ్‌లో ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ అనే సినిమాలో ఒక లెస్బియన్ ప్రేమికురాలి పాత్రలో నటించింది. ఇకపై నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు.. బోల్డ్ పాత్రలు.. రొటీన్ కి భిన్నంగా ఉండే పాత్రలు చేయాలని ఆసక్తిగా ఉన్నానని రెజీనా తెలిపింది. ప్రస్తుతం రెజీనా నటిస్తున్న ‘నేనే నా’ చిత్రంలో కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కిందని చెప్పింది ఈ భామ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!