HomeTelugu Trendingజల్లికట్టు ఆధారంగా సూర్య చిత్రం

జల్లికట్టు ఆధారంగా సూర్య చిత్రం

4a 2
జల్లికట్టు అంటే తమిళనాడులో ఓ సంప్రదాయ క్రీడ. జల్లికట్టు గ్రామీణ ప్రాంత వేడుక. సంక్రాంతి అనగానే మనకు కోడిపందాలు ఎలా గుర్తొస్తాయో జల్లికట్టు కూడా అంతే. సంక్రాంతి పండుగకు ముందు నుంచే జల్లికట్టు ఏర్పాట్లు ఊపందుకుంటాయి. ఎన్నెన్ని నిషేధాలు ఉన్నా, కోర్టుల ఆదేశాలు ఉన్నా జల్లికట్టు జరిగి తీరాల్సిందే. జంతువులకే కాదు మనుషుల ప్రాణాలకూ ముప్పు అని తెలిసినా ఇది సంక్రాంతి పండుగలో భాగమైపోయింది. జల్లికట్టు నేపథ్యంలో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నారు.

హీరో సూర్యకు ‘ఎన్‌జీకే’, ‘కాప్పాన్‌’ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించలేక పోయాయి. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూరరై పోట్రు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల కానుంది. ఆ తర్వాత వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు ‘వాడివాసల్‌’ అని పేరు పెట్టారు. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు వెట్రిమారన్‌ ఈ మధ్య నవలల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ‘వెక్కై’ అనే నవల ఆధారంగానే ‘అసురన్‌’ను తెరకెక్కించి హిట్‌ చిత్రంగా మలిచారు. ఇప్పుడు కూడా మరో నవల ఆధారంగా ‘వాడివాసల్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జల్లికట్టు పోటీల్లో ఎద్దులు దూసుకొచ్చే ద్వారాన్నే ‘వాడివాసల్‌’ అని తమిళంలో అంటారు. సీఎస్‌ చెల్లప్ప రాసిన ఓ నవల ఆధారంగా దీన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu