
Pawan Kalyan Wild Animals Movie:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నా, ఆయన సినీ ప్రేమికుల గుండెల్లో ఇంకా హీరోగానే ఉంటారు. నటనతోపాటు సింగింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ వంటి విభాగాల్లో కూడా ఆయన ప్రతిభ చూపించారు. ఆయన ‘జానీ’ సినిమా సమయంలోనే ఒక సెన్సేషనల్ డైరెక్షన్ ప్లాన్ చేశారు.
అదేంటంటే – పవన్ ఒక స్పెషల్ కాన్సెప్ట్‌తో వైల్డ్ అనిమల్స్‌తో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట. టైగర్ కబ్స్, ఇతర జాన్వర్లను నేరుగా అబ్జర్వ్ చేస్తూ పర్సనల్ రీసర్చ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల బయటపెట్టారు. అది నిజంగా సెట్ అయితే అప్పట్లోనే టాలీవుడ్‌లో ఓ వినూత్న ట్రెండ్ స్టార్ట్ అయ్యేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పటి నుంచే పవన్ లో డైరెక్షన్ ప్యాషన్ ఉందని ఈ అంశం మరోసారి రుజువైంది.
ప్రస్తుతం పవన్ ‘హరి హర వీర మల్లు’, ‘OG’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్న పవన్, భవిష్యత్తులో ఆ వన్యప్రాణుల సినిమా ప్రాజెక్ట్‌ను మళ్లీ తీసుకొస్తారేమో చూడాలి.
ALSO READ: మహేష్ బాబు చేసిన తప్పే Shah Rukh Khan కూడా చేస్తున్నారా?