రేణూ దేశాయ్‌ డెంగీ వ్యాధి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌

ప్రముఖ నటి, దర్శక-నిర్మాత రేణూ దేశాయ్ సంచలన విషయం బయటపెట్టారు. ప్రస్తుతం తాను డెంగీ వ్యాధి బారిన పడి కోలుకుంటున్నానని తెలిపారు. డెంగీ వ్యాధి నుంచి కోలుకుంటున్నప్పటికీ తాను ఓ షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పారు.

ఈ విషయమై ఇన్ స్టాగ్రామ్ లో రేణూ దేశాయ్ స్పందిస్తూ..ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారం కాబోయే షో కోసం షూటింగ్ జరిగింది. కొన్నిగంటల పాటు జరిగిన షూటింగ్ కు నేను కాదని చెప్పలేకపోయా. దోమల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పొడవైన దుస్తులనే ధరించండి’ అని సూచించారు. ఈ సందర్భంగా డెంగీ వ్యాధితో షూటింగ్ లో పాల్గొన్న సమయంలో దిగిన ఓ ఫొటోను రేణూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేణూ దేశాయ్ త్వరలోనే రైతుల కథాంశంతో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.