నా గదిలో లవ్లీ గర్ల్స్‌: వర్మ

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇదే గదిలో శ్రీదేవి పోస్టర్‌ను అతికించానని అంటున్నారు. ఆయనకు అతిలోక సుందరి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను వర్మ దేవతలా ఆరాధిస్తుంటారు. శ్రీదేవి భూలోకాన్ని విడిచి వెళ్లినా.. స్మరించుకుంటూనే ఉన్నారు.

వర్మ మరోసారి శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆయన చదువుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు తను ఉన్న గదికి వర్మ ఆదివారం వెళ్లారు. ఈ సందర్భంగా కొంత మంది అమ్మాయిలతో కలిసి దిగిన ఫొటోను మంగళవారం షేర్‌ చేస్తూ.. ‘బ్యాక్‌ టు మై స్టూడెంట్‌ డేస్‌.. ఈ గదిలో నేను దాదాపు రెండేళ్ల కంటే ఎక్కువ రోజులు ఉన్నాను. ఇప్పుడు అది అమ్మాయిల హాస్టల్‌ అయ్యింది. ఆ గదిలో ఈ లవ్లీ గర్ల్స్‌ ఉంటున్నారు. నా వెనుక ఉన్న ఈ గోడపై అప్పట్లో నేను శ్రీదేవి పోస్టర్‌ అతికించా’ అంటూ వర్మ ప్రేమతో చూస్తున్న ఎమోజీలను షేర్‌ చేశారు.